Songs index

List of Telugu Christian songs


Search Christian songs

yehova nin naamamu yento lyrics యెహోవా నీ నామము - ఎంతో బలమైనది

యెహోవా నీ నామము

పల్లవి:    యెహోవా నీ నామము - ఎంతో బలమైనది  ...ఆ...ఆ...ఆ...

యేసయ్య నీ నామము - ఎంతో ఘనమైనది ...ఆ...ఆ...ఆ...|| యెహోవా ||

1.        మోషే ప్రార్ధించగా - మన్నాను కురిపించితివి

యెహోషువా ప్రార్ధించగా - సూర్యచంద్రుల నాపితివి          || యెహోవా ||

2.        నీ ప్రజల పక్షముగా - యుద్దములు చేసిన దేవా

అగ్నిలో పడవేసినా - భయమేమి లేకుండిరి                 || యెహోవా ||

3.        సింహాల బోనుకైనా - సంతోషముగా వెళ్ళిరి

ప్రార్ధించిన వెంటనే - రక్షించె నీ హస్తము                     || యెహోవా ||

4.        చెరసాలలో వేసినా - సంకెళ్ళు బిగియించినా

సంఘము ప్రార్ధించగా - సంకెళ్ళు విడిపోయెను              || యెహోవా ||

This week top hits