Songs index

List of Telugu Christian songs


Search Christian songs

aascharyamina prema

ఆశ్చర్యమైన ప్రేమ
పల్లవి:    ఆశ్చర్యమైన ప్రేమ - కల్వరిలోని ప్రేమ
మరణము కంటె బలమైన ప్రేమది - నన్ను జయించె నీ ప్రేమ
1.        పరమును వీడిన ప్రేమ - ధరలో పాపిని వెదకిన ప్రేమ
నన్ను కరుణించి, ఆదరించి, సేదదీర్చి, నిత్య జీవమిచ్చె              
…ఆశ్చర్యమైన ప్రేమ…
2.        పావన యేసుని ప్రేమ - సిలువలో పాపిని మోసిన ప్రేమ 
నాకై మరణించి, జీవమిచ్చి, జయమిచ్చి, తన మహిమ నిచ్చే       
…ఆశ్చర్యమైన ప్రేమ…
3.        శ్రమలు సహించిన ప్రేమ - నాకై శాపము నోర్చిన ప్రేమ
విడనాడని, ప్రేమది, ఎన్నడు, యెడబాయదు                       
…ఆశ్చర్యమైన ప్రేమ…
4.        నా స్థితి జూచిన ప్రేమ - నాపై జాలిని జూపిన ప్రేమ
నాకై పరుగెత్తి, కౌగలించి, ముద్దాడి, కన్నీటిని తుడిచే                
…ఆశ్చర్యమైన ప్రేమ

This week top hits