Songs index

List of Telugu Christian songs


Search Christian songs

ruchi chuuchi yerigithini lyrics రుచి చూచి ఎరిగితిని

రుచి చూచి ఎరిగితిని

పల్లవి:   రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు
రక్షకు నాశ్రయించి నే ధన్యుడనైతిని                         || రుచి చూచి||

1.       గొప్ప దేవుడవు నీవే స్తుతులకు పాత్రుడ నీవే
తప్పక ఆరాధింతు దయాళుడవు నీవే                     || రుచి చూచి||

2.       మహోన్నతుడవగు దేవా ప్రభావము గలవాడా
మనసారా పొగడదను నీ ఆశ్చర్యకార్యములన్         || రుచి చూచి||

3.       మంచి తనము గల దేవా అతి శ్రేష్టుడవు అందరిలో
ముద మార పాడెద నిన్నుఅతి సుందరడవనియు  || రుచి చూచి||

4.       ప్రార్దింతును ఎడతెగక ప్రభు సన్నిధిలో చేరి
సంపూర్ణముగా పొం దెదను అడుగువాటన్నిటికి       || రుచి చూచి||

This week top hits