Songs index

List of Telugu Christian songs


Search Christian songs

ni swaramu vinipinchu prabhuva lyrics

నీ స్వరము వినిపించు ప్రభువా

పల్లవి:    నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకించున్

నీ వాక్యమును నేర్పించు దానియందు నడచునట్లు నీతో               .. నీ..

1.        ఉదయముననే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము

దినమంతటి కొరకు నను సిద్దపరచు రక్షించు ఆపదల నుండి           .. నీ..

2.        నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు సరి జేసుకొందు

నీ మార్గములో నడచునట్లుగా నేర్పించుము ఎల్లప్పుడు               .. నీ..

3.        భయ భీతులతో తుఫానులలో నీ స్వరము వినిపించుము

అభయము నిమ్ము ఓ గొప్ప దేవా ధైర్యపరచుము నన్ను              .. నీ..

4.        నాతో మాట్లాడు స్పస్టముగా ప్రభువా నీ స్వరము నా కొరకే

నీతో మనుష్యులతో సరిజేసుకొందు నీ దివ్య వాక్యము ద్వారా           .. నీ.

This week top hits