Songs index

List of Telugu Christian songs


Search Christian songs

neeti vagula koraku dhuppi aasinchunatlu

నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు (Dm)

పల్లవి:    నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు

నీ కొరకు నా ప్రాణము దప్పిగొనుచున్నది                      (2X)

నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్త్తుతియించుమా

నా యేసు చేసిన మేళ్లను నీవు మరువకుమా                (2X)

1.        పనికిరాని నను నీవు పైకి లేపితివి

క్రీస్తనే బండపైన నన్ను నిలిపితివి                    (2X)

నా అడుగులు స్థిర పరచి బలము నిచ్చితివి

నీదు అడుగు జాడలనే వెంబడింతు  ప్రభు

ఇలలో వెంబడింతు  ప్రభూ                                    

…నా ప్రాణమా…

2.        ఆంధకారపు లోయలలో నేను నడిచినను

ఏ అపాయము రాకుండ నన్ను నడిపితివి                   (2X)

కంటిపాపగ  నీవని నిన్ను కొలిచితివి

కన్న తండ్రివి నీవని నిన్ను కొలిచెదను

ఇలలో నిన్ను కొలిచెదను                                

…నా ప్రాణమా…

This week top hits