ఎందుకో నన్నింతగ నీవు
పల్లవి: ఎందుకో నన్నింతగ నీవు ప్రేమించితివో దేవా
అందుకో నా దీన స్తుతి పాత్ర హల్లెలూయ యేసయ్యా
1. నా పాపము బాప నరరూపి వైనావు - నా శాపము మాప నలిగి వ్రేలాడితివి
నాకు చాలిన దేవుడవు నీవే నా స్థానములో నీవే .. హల్లెలూయ..
2. నీ రూపము నాలో నిర్మించి యున్నావు నీ పోలికలోనే నివసించు చున్నావు
నీవు నన్ను ఎన్ను కొంటివి నీ కొరకై నీ క్రుపలో .. హల్లెలూయ..
3. నా శ్రమలు సహించి నా ఆశ్రయ మైనావు - నా వ్యధలు భరించి నన్నా దు కొన్నావు
నన్ను నీలో చూచుకున్నావు నను దాచి యున్నావు .. హల్లెలూయ..
endhuko nanninthaga neevu, enduko nannitaga neevu